లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 9: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 10:13
సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబ దేశపు రాణికిచ్చినది పోగ ఆమె కోరిన ప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
కీర్తనలు 20:4
నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
ఎఫెసీయులకు 3:20
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,