లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 15: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతో కూడ వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 18:2

జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతిక్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు నేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా

2సమూయేలు 6:10

యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.

2సమూయేలు 15:18

అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరేతీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.

2రాజులు 2:2

ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

జెకర్యా 8:23

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

యోహాను 6:67

కాబట్టి యేసు మీరుకూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా