లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 18: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు వాడు యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నాచేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 18:5

అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యౌవనుడైన అబ్షాలోమునకు దయజూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను.

2సమూయేలు 19:1

రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,

2సమూయేలు 20:6

దావీదు అబీషైని పిలువనంపి బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడు చేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.

1రాజులు 2:5

అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీవెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.

కీర్తనలు 55:20

తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.