2సమూయేలు 18: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారినప్పగించెను.
కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.
రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.
ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్లకోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదు తక్కువైనదేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.
అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.
అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,