లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 2: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 17:58

సౌలు అతనిని చూచి చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.

1దినవృత్తాంతములు 2:13

యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

1దినవృత్తాంతములు 2:14

నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

1దినవృత్తాంతములు 2:15

ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.

1దినవృత్తాంతములు 2:16

సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

2దినవృత్తాంతములు 16:14

అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తనకొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.

2దినవృత్తాంతములు 21:1

యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించితన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.

2సమూయేలు 5:1

ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి చిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము;

సామెతలు 22:29

తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.