లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 9: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 8:8

వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

1దినవృత్తాంతములు 8:34

యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

1దినవృత్తాంతములు 8:35

మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

1దినవృత్తాంతములు 8:36

ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

1దినవృత్తాంతములు 8:37

మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

1దినవృత్తాంతములు 8:38

ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

1దినవృత్తాంతములు 8:39

అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు.

1దినవృత్తాంతములు 8:40

ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు.

1దినవృత్తాంతములు 9:40

యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

1దినవృత్తాంతములు 9:41

మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)

1దినవృత్తాంతములు 9:42

ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

1దినవృత్తాంతములు 9:43

మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.

1దినవృత్తాంతములు 9:44

ఆజేలునకు ఆరుగురు కుమారులుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లు గలవారు; వీరు ఆజేలు కుమారులు.

మీకా 7:5

స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.

మీకా 7:6

కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు.