లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 9: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 17:27

దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు

2సమూయేలు 17:28

అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవలుపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు

2సమూయేలు 17:29

తేనె వెన్న గొఱ్ఱలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

యెహోషువ 13:26

హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును