లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 18: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులకందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 10:9

కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.

ద్వితియోపదేశాకాండము 12:19

నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ.

సంఖ్యాకాండము 18:20

మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

సంఖ్యాకాండము 26:62

వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు.

యెహోషువ 13:33

లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు; ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.

యెహోషువ 18:7

లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు.

1పేతురు 5:2

బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

1పేతురు 5:3

మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;

1పేతురు 5:4

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

సంఖ్యాకాండము 18:8

మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.

సంఖ్యాకాండము 18:9

అగ్నిలో దహింపబడని అతిపరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్నిటిలోను, వారి అపరాధపరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగిచెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.

యెహోషువ 13:14

లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్య లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము.

1కొరిందీయులకు 9:13

ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?

1కొరిందీయులకు 9:14

ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.

లేవీయకాండము 25:33

లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపాదించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును.

ద్వితియోపదేశాకాండము 12:12

మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

ద్వితియోపదేశాకాండము 14:27

లేవీయులను విడువకూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.

ద్వితియోపదేశాకాండము 33:11

యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.

1సమూయేలు 2:28

అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.

1దినవృత్తాంతములు 6:49

అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.

యెహెజ్కేలు 44:28

వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము.