ద్వితియోపదేశాకాండము 18: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.
వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.
అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,
స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.
వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రతచేతను వారు చేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.
కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమివేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగినపని చేయును.