ద్వితియోపదేశాకాండము 2: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు ఆ పట్టణమునుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.
యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలు దేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి.
అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.
ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలిపోయెను.