లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 2: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 22:4

మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.

న్యాయాధిపతులు 11:17

అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ­ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.

2దినవృత్తాంతములు 20:10

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగిపోయిరి.

ద్వితియోపదేశాకాండము 2:5

వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.

సంఖ్యాకాండము 21:15

ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.

సంఖ్యాకాండము 21:28

హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.

ద్వితియోపదేశాకాండము 2:19

వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.

ఆదికాండము 19:36

ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

ఆదికాండము 19:37

వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

కీర్తనలు 83:8

అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)

ఆదికాండము 19:38

చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

ద్వితియోపదేశాకాండము 2:37

అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.

ద్వితియోపదేశాకాండము 29:16

మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటివచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చితిమో మీరెరుగుదురు.

న్యాయాధిపతులు 11:15

యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.

2రాజులు 3:25

మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.

యెషయా 15:1

మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

యిర్మియా 27:5

అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.