లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 23: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 22:25

నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వానియెడల జరిగింపకూడదు, వానికి వడ్డి కట్టకూడదు.

లేవీయకాండము 25:35

పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.

లేవీయకాండము 25:36

నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసికొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.

లేవీయకాండము 25:37

నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.

నెహెమ్యా 5:1

తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదు చేసిరి.

నెహెమ్యా 5:2

ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకులము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.

నెహెమ్యా 5:3

మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.

నెహెమ్యా 5:4

మరికొందరు రాజు గారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు.

నెహెమ్యా 5:5

మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా

నెహెమ్యా 5:6

వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.

నెహెమ్యా 5:7

అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

కీర్తనలు 15:5

తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

యెహెజ్కేలు 18:7

ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

యెహెజ్కేలు 18:8

వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి

యెహెజ్కేలు 18:13

అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును.

యెహెజ్కేలు 18:16

ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

యెహెజ్కేలు 18:17

బీదవాని మీద అన్యాయముగా చెయ్యివేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండినయెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.

యెహెజ్కేలు 18:18

అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగనిక్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణమునొందును.

యెహెజ్కేలు 22:12

నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

లూకా 6:34

మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.

లూకా 6:35

మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

నిర్గమకాండము 22:14

ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసికొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.

లేవీయకాండము 25:36

నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసికొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.

నెహెమ్యా 5:7

అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

యిర్మియా 15:10

అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు.

మత్తయి 25:27

అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచవలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి

లూకా 19:23

నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసియుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి