లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 23: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీచేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 12:1

ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

మత్తయి 12:2

పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా

మార్కు 2:23

మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.

లూకా 6:1

ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి.

లూకా 6:2

అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా