లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 28: 60

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీమీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 7:15

యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించువారందరిమీదికే వాటిని పంపించును.

నిర్గమకాండము 15:26

మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను

ఆమోసు 4:10

మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కు నంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతము చేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.