నిర్గమకాండము 25: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్ల మోయబడును."
సంబంధిత రిఫరెన్స్‌లు
వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.
బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.
మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.
అందుకు ప్రభువు నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు
తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.
మరియు అతడు తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డకఱ్ఱలను
బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.