నిర్గమకాండము 29: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము.
గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొని రావలెను.
అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.
యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడిజబ్బమీదను వాటిని ఉంచి
మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రత సంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతుల మీద వాటినుంచవలెను.