లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 29: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొని రావలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 8:2

నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాపపరిహారార్థబలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని

లేవీయకాండము 8:26

యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడిజబ్బమీదను వాటిని ఉంచి

లేవీయకాండము 8:31

అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.

సంఖ్యాకాండము 6:17

యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.

నిర్గమకాండము 29:15

నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా

నిర్గమకాండము 29:19

మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమచేతులుంచగా

నిర్గమకాండము 29:23

ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని

నిర్గమకాండము 29:32

అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.

సంఖ్యాకాండము 8:8

తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను.