నిర్గమకాండము 29: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును."
సంబంధిత రిఫరెన్స్‌లు
అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండినయెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.
అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.