నిర్గమకాండము 29: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమచేతులనుంచగా
ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.
ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను.
మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.
ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.
ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్మునంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొలకఱ్ఱలును ఉండును.
ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.
ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువది యయిదువేల కొలకఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.
మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.
అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతిక్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.
పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.
మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి
యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.
పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొనిపోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను.
ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి
అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును.
మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
దహనబలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.
ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.
అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను.
మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,
మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపపరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
దహనబలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.
దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.
అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.
వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.
ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక,
అదేవిధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.