నిర్గమకాండము 29: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి"
సంబంధిత రిఫరెన్స్‌లు
అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసికొని
బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను.
రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడి యుండును.
మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి
ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి
మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.
దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పనిగలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహనబలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను
ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.