లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 41: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడియుండెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 41:5

తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.

యెహెజ్కేలు 41:11

మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగానున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుండెను.

యెహెజ్కేలు 42:1

అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

యెహెజ్కేలు 42:4

గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముండెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.