లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 41: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 41:16

మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను

యెహెజ్కేలు 41:17

వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడియుండెను.

యెహెజ్కేలు 41:18

కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములుండెను.

యెహెజ్కేలు 41:19

ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టువైపున సింహ ముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.

యెహెజ్కేలు 41:20

నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను.

1రాజులు 7:36

దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటునుబట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.

యెహెజ్కేలు 40:15

బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపు ద్వారమువరకు ఏబదిమూరలు.