ఆదికాండము 38: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" దాని మామ తన గొఱ్ఱల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోనుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా
ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను.
కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱలును వెయ్యి మేకలును ఉండెను. అతడు కర్మెలులో తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించుటకై పోయియుండెను.
నాబాలు గొఱ్ఱలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని
రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదుగురు.