లేఖనాలను అన్వేషించండి

యోబు 28: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 26:8

వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.

యెషయా 37:25

నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటిని ఎండిపోచేసియున్నాను

యెషయా 44:27

నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను

యెషయా 45:2

నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

యెషయా 45:3

పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.

1కొరిందీయులకు 4:5

కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనినిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును.

యోబు 41:5

నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?