లేఖనాలను అన్వేషించండి

యోబు 28: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 135:7

భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

యెషయా 40:12

తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

ఆదికాండము 7:4

ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.

యోబు 11:9

దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

యోబు 38:5

నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.