లేఖనాలను అన్వేషించండి

విలాపవాక్యములు 3: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

విలాపవాక్యములు 3:11

నాకు త్రోవలేకుండ చేసి నా యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు

యెషయా 30:28

ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

యెషయా 63:17

యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము.

యోబు 3:23

మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

యోబు 19:8

నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు

యోబు 36:8

వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధా పాశములచేత పట్టబడినయెడలను

విలాపవాక్యములు 3:7

ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలువెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు