లేఖనాలను అన్వేషించండి

విలాపవాక్యములు 3: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

విలాపవాక్యములు 2:10

సీయోనుకుమారి పెద్దలు మౌనులై నేలకూర్చుందురు తలలమీద బుగ్గిపోసికొందురు గోనెపట్ట కట్టుకొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు.

కీర్తనలు 39:9

దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.

కీర్తనలు 102:7

రాత్రి మెలకువగానుండి యింటిమీద ఒంటిగానున్న పిచ్చుకవలె నున్నాను.

యిర్మియా 15:17

సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.

ప్రసంగి 3:7

చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

యిర్మియా 8:14

మనమేల కూర్చుండియున్నాము? మనము పోగుబడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.