లేఖనాలను అన్వేషించండి

విలాపవాక్యములు 3: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలువెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 88:5

చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీచేతిలోనుండి తొలగిపోయియున్నారు గదా.

కీర్తనలు 88:6

అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టియున్నావు.

కీర్తనలు 143:3

శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.

కీర్తనలు 143:7

యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము

కీర్తనలు 107:10

దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

యెషయా 59:10

గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలుజారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారివలె ఉన్నాము.

యెహెజ్కేలు 26:20

మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;