విలాపవాక్యములు 3: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొనియున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసియున్నాడు
మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడియున్నాను
వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.
కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైనవేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.
మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కియున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతియనునది మాకు లేదు.
యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చెను.
కాబట్టి యెహోవా అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతులను వారిమీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొనిపోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.
నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలియుంచెదవు?
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించియున్నాడు
దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.