లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 13: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 13:4

నిగనిగలాడు మచ్చ చర్మములకంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.

లేవీయకాండము 13:18

ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత

లేవీయకాండము 13:19

ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను.

లేవీయకాండము 13:20

యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.