లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 11: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 16:13

కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను.

నిర్గమకాండము 16:14

పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.

ద్వితియోపదేశాకాండము 32:2

నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

కీర్తనలు 78:23

అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను

కీర్తనలు 78:24

ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించెను.

కీర్తనలు 78:25

దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

కీర్తనలు 105:40

వారు మనవిచేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.