సంఖ్యాకాండము 4: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద నుండవలెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.
మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.
నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.
మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.
అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.
దేవుని మందిరములో అధిపతియైన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;
ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.