Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 6 వచనము 1

1దినవృత్తాంతములు 23:6 గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 3:17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.

సంఖ్యాకాండము 26:57 వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

1దినవృత్తాంతములు 6:16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

1దినవృత్తాంతములు 6:20 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,

నిర్గమకాండము 2:1 లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.

సంఖ్యాకాండము 1:47 అయితే లేవీయులు తమ పితరుల గోత్రముచొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

1దినవృత్తాంతములు 6:43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.

1దినవృత్తాంతములు 6:61 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.

ఎజ్రా 8:19 హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులును వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి.

హెబ్రీయులకు 7:3 అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై యుండి దేవుని కుమారుని పోలియున్నాడు.