Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 6 వచనము 32

1దినవృత్తాంతములు 16:4 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.

1దినవృత్తాంతములు 16:5 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

1దినవృత్తాంతములు 16:6 బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

1దినవృత్తాంతములు 16:37 అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదెదోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

1దినవృత్తాంతములు 16:38 యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను

1దినవృత్తాంతములు 16:39 గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

1దినవృత్తాంతములు 16:40 ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.

1దినవృత్తాంతములు 16:41 యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను.

1దినవృత్తాంతములు 16:42 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను.

కీర్తనలు 68:24 దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా

కీర్తనలు 68:25 కీర్తనలు పాడువారు ముందరనడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.

ఎఫెసీయులకు 5:19 ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,

1దినవృత్తాంతములు 6:10 యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.

1రాజులు 8:6 మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బాలయమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.

1రాజులు 8:7 కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను.

1రాజులు 8:8 వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడలేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి.

1రాజులు 8:9 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేకపోయెను.

1రాజులు 8:10 యాజకులు పరిశుద్ధ స్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.

1రాజులు 8:11 కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి.

1రాజులు 8:12 సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

1రాజులు 8:13 నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి

1దినవృత్తాంతములు 9:33 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.

1దినవృత్తాంతములు 25:7 యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.

1దినవృత్తాంతములు 25:8 తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లు వేసిరి.

1దినవృత్తాంతములు 25:9 మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:10 మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:11 నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:12 అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:13 ఆరవది బక్కీయాహు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:14 ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:15 ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:16 తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:17 పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:18 పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:19 పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:20 పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:21 పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:22 పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:23 పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:24 పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:25 పదునెనిమిదవది హనానీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:26 పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:27 ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:28 ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:29 ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:30 ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:31 ఇరువది నాలుగవది రోమమ్తీయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

2దినవృత్తాంతములు 29:25 మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించియుండెను.

2దినవృత్తాంతములు 29:26 దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియమింపబడిరి.

2దినవృత్తాంతములు 29:27 బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.

2దినవృత్తాంతములు 29:28 అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహనబలి యర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.

2దినవృత్తాంతములు 29:29 వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.

2దినవృత్తాంతములు 29:30 దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి.

2దినవృత్తాంతములు 31:2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.

2దినవృత్తాంతములు 35:15 మరియు ఆసాపు సంతతివారగు గాయకులును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమచేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.

ఎజ్రా 3:10 శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

ఎజ్రా 3:11 వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.

ఎజ్రా 6:18 మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసినదానినిబట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి.

నెహెమ్యా 11:17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతనిచేతిక్రిందివారు

నెహెమ్యా 11:18 పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.

నెహెమ్యా 11:19 ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.

నెహెమ్యా 11:20 ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి.

నెహెమ్యా 11:21 నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.

నెహెమ్యా 11:22 యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు

నెహెమ్యా 11:23 వారినిగూర్చిన విధియేదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.

నెహెమ్యా 12:27 యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి

నెహెమ్యా 12:28 అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి.

నెహెమ్యా 12:45 మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.

నెహెమ్యా 12:46 పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.

నెహెమ్యా 12:47 జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.

కీర్తనలు 134:1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.

కీర్తనలు 134:2 పరిశుద్ధస్థలమువైపు మీచేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.

కీర్తనలు 135:1 యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,

కీర్తనలు 135:2 యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారలారా, యెహోవాను స్తుతించుడి.

కీర్తనలు 135:3 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.

1దినవృత్తాంతములు 6:33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్న వారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

1రాజులు 12:6 అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా

1రాజులు 12:8 అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన యౌవనులను పిలిచి ఆలోచననడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను

1కొరిందీయులకు 12:11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

సంఖ్యాకాండము 3:10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.

2దినవృత్తాంతములు 7:6 రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.

2దినవృత్తాంతములు 8:14 అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.

యెహెజ్కేలు 40:44 లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మముదగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొకటియు రెండు గదులుండెను.

తీతుకు 1:5 నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.