Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 6 వచనము 38

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 3:19 కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.

1దినవృత్తాంతములు 16:1 ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొనివచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

ఆదికాండము 29:34 ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను

ఆదికాండము 32:28 అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

నిర్గమకాండము 6:21 ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

నిర్గమకాండము 6:24 కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.

1సమూయేలు 8:2 అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,