Logo

ఆదికాండము అధ్యాయము 48 వచనము 11

ఆదికాండము 37:33 అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్టమృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.

ఆదికాండము 37:35 అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారునియొద్దకు వెళ్లేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను

ఆదికాండము 42:36 అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను

ఆదికాండము 45:26 యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.

ఎఫెసీయులకు 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

కీర్తనలు 107:41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

ఫిలిప్పీయులకు 2:28 కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.

1దెస్సలోనీకయులకు 2:17 సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.