Logo

ఆదికాండము అధ్యాయము 48 వచనము 21

ఆదికాండము 50:24 యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొనిపోవునని చెప్పెను

1రాజులు 2:2 లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను; కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి

1రాజులు 2:3 నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించినయెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;

1రాజులు 2:4 అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగానుండి నాయెదుట తమ పూర్ణహృదయముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనినయెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనముమీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్నుగూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.

కీర్తనలు 146:3 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

కీర్తనలు 146:4 వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.

జెకర్యా 1:5 మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?

జెకర్యా 1:6 అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

లూకా 2:29 నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

అపోస్తలులకార్యములు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,

2తిమోతి 4:6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది.

హెబ్రీయులకు 7:3 అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై యుండి దేవుని కుమారుని పోలియున్నాడు.

హెబ్రీయులకు 7:8 మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

హెబ్రీయులకు 7:23 మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని

హెబ్రీయులకు 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను.

హెబ్రీయులకు 7:25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.

2పేతురు 1:14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

ఆదికాండము 15:14 వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

ఆదికాండము 28:15 ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

ఆదికాండము 46:4 నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా

ద్వితియోపదేశాకాండము 1:1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.

ద్వితియోపదేశాకాండము 1:2 హోరేబునుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.

ద్వితియోపదేశాకాండము 1:3 హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతముచేసిన తరువాత

ద్వితియోపదేశాకాండము 1:4 నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 1:5 యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను

ద్వితియోపదేశాకాండము 1:6 మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును;

ద్వితియోపదేశాకాండము 1:7 మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి.

ద్వితియోపదేశాకాండము 1:8 ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి.

ద్వితియోపదేశాకాండము 1:9 అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను.

ద్వితియోపదేశాకాండము 1:10 మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశనక్షత్రములవలె విస్తరించియున్నారు.

ద్వితియోపదేశాకాండము 1:11 మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.

ద్వితియోపదేశాకాండము 1:12 నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?

ద్వితియోపదేశాకాండము 1:13 జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా

ద్వితియోపదేశాకాండము 1:14 మీరు నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.

ద్వితియోపదేశాకాండము 1:15 కాబట్టి బుద్ధికలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యిమందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.

ద్వితియోపదేశాకాండము 1:16 అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.

ద్వితియోపదేశాకాండము 1:17 తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యెమును నాయొద్దకు తీసికొనిరావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని.

ద్వితియోపదేశాకాండము 1:18 మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములనుగూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.

ద్వితియోపదేశాకాండము 1:19 మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.

ద్వితియోపదేశాకాండము 1:20 అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము.

ద్వితియోపదేశాకాండము 1:21 ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని.

ద్వితియోపదేశాకాండము 1:22 అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగివచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి.

ద్వితియోపదేశాకాండము 1:23 ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని.

ద్వితియోపదేశాకాండము 1:24 వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని

ద్వితియోపదేశాకాండము 1:25 మనయొద్దకు తీసికొనివచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి.

ద్వితియోపదేశాకాండము 1:26 అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి

ద్వితియోపదేశాకాండము 1:27 మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయులచేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములోనుండి మనలను రప్పించియున్నాడు.

ద్వితియోపదేశాకాండము 1:28 మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.

ద్వితియోపదేశాకాండము 1:29 అప్పుడు నేను మిమ్మునుచూచి దిగులుపడకుడి, వారికి భయపడకుడి,

ద్వితియోపదేశాకాండము 1:30 మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట

ద్వితియోపదేశాకాండము 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధముచేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొనివచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.

ద్వితియోపదేశాకాండము 1:32 అయితే మీకు త్రోవచూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు

ద్వితియోపదేశాకాండము 1:33 రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు.

ద్వితియోపదేశాకాండము 1:34 కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని

ద్వితియోపదేశాకాండము 1:35 బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచిదేశమును ఈ చెడ్డతరమువారిలో

ద్వితియోపదేశాకాండము 1:36 యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.

ద్వితియోపదేశాకాండము 1:37 మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.

ద్వితియోపదేశాకాండము 1:38 అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొనచేయును గనుక అతని ధైర్యపరచుము.

ద్వితియోపదేశాకాండము 1:39 ఆ దినమున మంచిచెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారికిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.

ద్వితియోపదేశాకాండము 1:40 మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 1:41 అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటిననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా

ద్వితియోపదేశాకాండము 1:42 యెహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండనుగనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.

ద్వితియోపదేశాకాండము 1:43 ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.

ద్వితియోపదేశాకాండము 1:44 అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.

ద్వితియోపదేశాకాండము 1:45 తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.

ద్వితియోపదేశాకాండము 1:46 కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.

ద్వితియోపదేశాకాండము 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను.

యెహోషువ 1:5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.

యెహోషువ 1:9 నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

యెహోషువ 3:7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందు నని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.

యెహోషువ 23:14 ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.

యెహోషువ 24:1 యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారి నందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.

యెహోషువ 24:2 యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.

యెహోషువ 24:3 అయితే నేను నది అద్దరినుండి మీ పితరుడైన అబ్రాహామును తోడు కొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చి తిని.

యెహోషువ 24:4 ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.

యెహోషువ 24:5 తరువాత నేను మోషే అహరోనులను పంపి, దాని మధ్యను నేను చేసిన క్రియలవలన ఐగుప్తీయులను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని.

యెహోషువ 24:6 నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.

యెహోషువ 24:7 వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివ సించితిరి.

యెహోషువ 24:8 యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధముచేయగా నేను మీచేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ యెదుట నిలువకుండ వారిని నశింపజేసితిని.

యెహోషువ 24:9 తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకులేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా

యెహోషువ 24:10 నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.

యెహోషువ 24:11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీచేతికప్పగించితిని.

యెహోషువ 24:12 మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును

యెహోషువ 24:13 మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.

యెహోషువ 24:14 కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవిం చుడి.

యెహోషువ 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

యెహోషువ 24:16 అందుకు ప్రజలుయెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాప గ్రస్తుల మగుదుము గాక.

యెహోషువ 24:17 ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజ లందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.

యెహోషువ 24:18 యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీ యులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి.

యెహోషువ 24:19 అందుకు యెహోషువయెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధ ములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు.

యెహోషువ 24:20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా

యెహోషువ 24:21 జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి.

యెహోషువ 24:22 అప్పుడు యెహో షువమీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారుమేము సాక్షులమే అనిరి.

యెహోషువ 24:23 అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.

యెహోషువ 24:24 అందుకు జనులుమన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.

యెహోషువ 24:25 అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి

యెహోషువ 24:26 దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములో నున్న సిందూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి

యెహోషువ 24:27 జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును.

యెహోషువ 24:28 అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను.

యెహోషువ 24:29 ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్స రముల వయస్సుగలవాడై మృతి నొందెను.

యెహోషువ 24:30 అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతి పెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది.

యెహోషువ 24:31 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.

యెహోషువ 24:32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.

యెహోషువ 24:33 మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

కీర్తనలు 18:46 యెహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

ఆదికాండము 12:5 అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి

ఆదికాండము 26:3 ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;

ఆదికాండము 37:1 యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

ఆదికాండము 27:2 అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.

ఆదికాండము 50:5 నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.

ఆదికాండము 50:6 అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.

నిర్గమకాండము 13:19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొనివచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొనిపోవలెనని ఇశ్రాయేలీయులచేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.

సంఖ్యాకాండము 14:9 మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారిమీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా

ద్వితియోపదేశాకాండము 31:3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.

2సమూయేలు 19:37 నేను నా ఊరి యందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలినవాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవిచేయగా

హెబ్రీయులకు 9:17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?

హెబ్రీయులకు 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి.