Logo

ఆదికాండము అధ్యాయము 48 వచనము 18

ఆదికాండము 19:18 లోతు ప్రభువా ఆలాగు కాదు.

నిర్గమకాండము 10:11 పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.

మత్తయి 25:9 అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 10:14 అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

అపోస్తలులకార్యములు 11:8 అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా

ఆదికాండము 27:15 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తనయొద్ద నుండెను గనుక

ఆదికాండము 29:26 అందుకు లాబాను పెద్దదానికంటె ముందుగా చిన్నదానినిచ్చుట మాదేశ మర్యాదకాదు.

ఆదికాండము 43:33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.

ఆదికాండము 49:3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.

ఆదికాండము 41:51 అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

ఆదికాండము 48:14 మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తనచేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.

యెహోషువ 17:1 మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.