Logo

సామెతలు అధ్యాయము 9 వచనము 2

మత్తయి 16:18 మరియు నీవు పేతురువు? ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 3:9 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

1కొరిందీయులకు 3:10 దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

1కొరిందీయులకు 3:11 వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.

1కొరిందీయులకు 3:12 ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,

1కొరిందీయులకు 3:13 వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

1కొరిందీయులకు 3:14 పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.

1కొరిందీయులకు 3:15 ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

ఎఫెసీయులకు 2:20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

ఎఫెసీయులకు 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.

ఎఫెసీయులకు 2:22 ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

1తిమోతి 3:15 అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది

హెబ్రీయులకు 3:3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,

హెబ్రీయులకు 3:4 ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.

హెబ్రీయులకు 3:5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

హెబ్రీయులకు 3:6 అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

1పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1పేతురు 2:6 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

1రాజులు 7:2 మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను.

1రాజులు 7:3 మరియు నలువదియైదు స్తంభములమీద ప్రక్క గదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.

1రాజులు 7:6 మరియు అతడు స్తంభములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటపమును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.

1రాజులు 7:21 ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.

గలతీయులకు 2:9 స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

ప్రకటన 3:12 జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవునియొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.

సామెతలు 8:1 జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

సామెతలు 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును.

యెషయా 25:6 ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

జెఫన్యా 1:7 ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్ని ధిని మౌనముగా నుండుడి.

మత్తయి 22:3 ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.

మత్తయి 22:4 కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని

లూకా 11:49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.

లూకా 14:16 ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

లూకా 14:17 విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

యోహాను 2:10 ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.