Logo

సామెతలు అధ్యాయము 9 వచనము 9

సామెతలు 23:9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

సామెతలు 29:1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

సంఖ్యాకాండము 14:6 అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని

సంఖ్యాకాండము 14:7 ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.

సంఖ్యాకాండము 14:8 యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించు దేశము.

సంఖ్యాకాండము 14:9 మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారిమీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా

సంఖ్యాకాండము 14:10 ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయుల కందరికి కనబడెను.

1రాజులు 22:8 అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలాగనవద్దనెను.

మత్తయి 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

మత్తయి 15:14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

హెబ్రీయులకు 6:4 ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

హెబ్రీయులకు 6:5 దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు,

హెబ్రీయులకు 6:6 తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

హెబ్రీయులకు 6:7 ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

హెబ్రీయులకు 6:8 అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.

సామెతలు 13:18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

సామెతలు 28:23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.

లేవీయకాండము 19:17 నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీమీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.

2సమూయేలు 12:7 నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలుచేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి

2సమూయేలు 12:8 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

2సమూయేలు 12:9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

2సమూయేలు 12:10 నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

2సమూయేలు 12:11 నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను.

2సమూయేలు 12:12 పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

2సమూయేలు 12:13 నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.

2సమూయేలు 12:14 అయితే ఈ కార్యమువలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి

1రాజులు 1:23 అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి

1రాజులు 1:32 అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.

కీర్తనలు 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.

గలతీయులకు 2:11 అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

గలతీయులకు 2:12 ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.

గలతీయులకు 2:13 తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.

గలతీయులకు 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

2పేతురు 3:15 మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.

2పేతురు 3:16 వీటినిగూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.

ఆదికాండము 19:9 ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.

ఆదికాండము 20:16 మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీయొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.

2దినవృత్తాంతములు 18:7 ఇశ్రాయేలు రాజు యెహోవాయొద్ద విచారణ చేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగగలిగి యున్నాననగా యెహోషాపాతు రాజు ఆలా గనవద్దనెను.

2దినవృత్తాంతములు 25:16 అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి నీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము; నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించి యున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.

సామెతలు 3:34 అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.

సామెతలు 12:1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు

సామెతలు 15:12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.

సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును

సామెతలు 15:31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.

సామెతలు 17:10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

సామెతలు 25:12 బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.

ప్రసంగి 7:5 బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.

ఆమోసు 5:10 అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.

మార్కు 8:33 అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను

లూకా 3:19 అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

లూకా 9:55 ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

లూకా 17:3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము.

యోహాను 7:7 లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

యోహాను 7:52 వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

యోహాను 9:34 అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.

అపోస్తలులకార్యములు 7:27 అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?

2కొరిందీయులకు 7:7 తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.

గలతీయులకు 4:16 నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?

ఎఫెసీయులకు 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి.

1యోహాను 2:21 మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను.