Logo

సామెతలు అధ్యాయము 9 వచనము 5

సామెతలు 9:16 జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును.

సామెతలు 1:22 ఎట్లనగా, జ్ఞానము లేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?

సామెతలు 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

సామెతలు 8:5 జ్ఞానము లేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధి యెట్టిదైనది యోచించి చూడుడి.

కీర్తనలు 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

కీర్తనలు 119:130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును

మత్తయి 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.

ప్రకటన 3:18 నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

ప్రకటన 22:17 ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

యోబు 36:10 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.

కీర్తనలు 14:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

కీర్తనలు 25:8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.

సామెతలు 1:4 జ్ఞానము లేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

సామెతలు 7:7 యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.

సామెతలు 17:16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేల? వానికి బుద్ధి లేదుగదా?

మత్తయి 22:9 గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.

యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.