Logo

సామెతలు అధ్యాయము 21 వచనము 1

సామెతలు 19:25 అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.

సామెతలు 22:15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.

యెషయా 27:9 కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.

హెబ్రీయులకు 12:10 వారు కొన్నిదినములమట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.

సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.