Logo

సామెతలు అధ్యాయము 21 వచనము 6

సామెతలు 10:4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

సామెతలు 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

సామెతలు 27:23 నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.

సామెతలు 27:24 ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?

సామెతలు 27:25 ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది

సామెతలు 27:26 నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును

సామెతలు 27:27 నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.

ఎఫెసీయులకు 4:28 దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తనచేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

1దెస్సలోనీకయులకు 4:11 సంఘమునకు వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక,

1దెస్సలోనీకయులకు 4:12 మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీచేతులతో పనిచేయుట యందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 20:21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

సామెతలు 28:22 చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.

సామెతలు 19:2 ఒకడు తెలివి లేకుండుట మంచిదికాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును

సామెతలు 29:20 ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.