Logo

సామెతలు అధ్యాయము 21 వచనము 20

సామెతలు 21:9 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

కీర్తనలు 55:6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

కీర్తనలు 55:7 త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

కీర్తనలు 120:5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

కీర్తనలు 120:6 కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.

యిర్మియా 9:2 నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.

సామెతలు 9:13 బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.

సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.

సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తనచేతులతో తన యిల్లు ఊడబెరుకును.

సామెతలు 15:17 పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

సామెతలు 17:1 రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.

సామెతలు 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

సామెతలు 25:24 గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు

సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము

సామెతలు 30:23 కంటకురాలైయుండి పెండ్లియైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి.

మత్తయి 19:10 ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.