Logo

సామెతలు అధ్యాయము 25 వచనము 1

సామెతలు 10:4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

సామెతలు 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

2సమూయేలు 4:5 రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.

2సమూయేలు 11:2 ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

యోబు 15:24 శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.

సామెతలు 6:9 సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

సామెతలు 6:10 ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు

సామెతలు 13:25 నీతిమంతుడు ఆకలితీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

సామెతలు 20:4 విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

ప్రసంగి 4:5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.

మార్కు 13:36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.