Logo

సామెతలు అధ్యాయము 25 వచనము 25

సామెతలు 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

సామెతలు 21:9 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

సామెతలు 21:19 ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.

సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము

సామెతలు 27:16 దానిని ఆపజూచువాడు గాలిని అపజూచు వానితోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు.

సామెతలు 7:11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.

సామెతలు 18:6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

తీతుకు 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి యుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.