Logo

సామెతలు అధ్యాయము 25 వచనము 14

సామెతలు 25:25 దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.

సామెతలు 13:17 దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు.

సామెతలు 26:6 మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.

ఫిలిప్పీయులకు 2:25 మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.

ఫిలిప్పీయులకు 2:26 అతడు రోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.

ఫిలిప్పీయులకు 2:27 నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతని మాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.

ఫిలిప్పీయులకు 2:28 కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.

ఫిలిప్పీయులకు 2:29 నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను

ఫిలిప్పీయులకు 2:30 గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

యెహోషువ 2:24 మరియు వారుఆ దేశ మంతయు యెహోవా మనచేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.

యెహోషువ 22:32 యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహా సును ప్రధానులును గిలాదులోని రూబేనీయులయొద్దనుండియు, గాదీయులయొద్దనుండియు ఇశ్రాయేలీయులయొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా

2సమూయేలు 18:27 కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ

1రాజులు 20:33 అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.

సామెతలు 10:26 సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.

రోమీయులకు 15:32 మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు, ఆత్మవలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

1కొరిందీయులకు 16:18 మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి.

1తిమోతి 3:11 అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.