Logo

హోషేయ అధ్యాయము 13 వచనము 13

ద్వితియోపదేశాకాండము 32:34 ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?

ద్వితియోపదేశాకాండము 32:35 వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

యోబు 14:17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

యోబు 21:19 వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

రోమీయులకు 2:5 నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

యిర్మియా 2:22 నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.