Logo

హోషేయ అధ్యాయము 14 వచనము 6

ద్వితియోపదేశాకాండము 32:2 నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

2సమూయేలు 23:4 ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.

యోబు 29:19 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.

కీర్తనలు 72:6 గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును.

సామెతలు 19:12 రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచువంటిది.

యెషయా 18:4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

యెషయా 26:19 మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

యెషయా 44:3 నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

మీకా 5:7 యాకోబు సంతతిలో శేషించినవారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్యప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆ యా జనముల మధ్యను నుందురు.

పరమగీతము 2:1 నేను షారోను పొలములో పూయు పుష్పమువంటిదానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.

పరమగీతము 2:2 బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.

పరమగీతము 2:16 నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు

పరమగీతము 4:5 నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.

మత్తయి 6:28 వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగునెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు

లూకా 12:27 అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.

2రాజులు 19:30 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

కీర్తనలు 72:16 దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.

యెషయా 27:6 రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

యెషయా 35:2 అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెహెజ్కేలు 17:22 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నత పర్వతముమీద దాని నాటుదును.

యెహెజ్కేలు 17:23 ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.

యెహెజ్కేలు 17:24 దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చనిచెట్టు ఎండిపోవునట్లును ఎండినచెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.

ఎఫెసీయులకు 3:17 తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు,

ఆదికాండము 27:28 ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించు గాక

సంఖ్యాకాండము 17:5 అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.

ద్వితియోపదేశాకాండము 33:13 యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన

న్యాయాధిపతులు 6:37 నేను కళ్లమున గొఱ్ఱబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱ బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.

యోబు 15:32 వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

యోబు 38:28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?

కీర్తనలు 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

కీర్తనలు 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు

పరమగీతము 2:12 దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.

యెషయా 35:1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును

యెషయా 45:8 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

హోషేయ 6:3 యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

హోషేయ 14:7 అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.

యోవేలు 2:22 పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,

జెకర్యా 8:12 సమాధాన సూచకమైన ద్రాక్షచెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

మలాకీ 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

ఎఫెసీయులకు 4:15 ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

1పేతురు 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని,

2పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.