Logo

జెకర్యా అధ్యాయము 14 వచనము 5

జెకర్యా 14:7 ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.

యెహెజ్కేలు 11:23 మరియు యెహోవా మహిమ పట్టణములోనుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకు పైగా నిలిచెను.

యెహెజ్కేలు 43:2 ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టినధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను.

అపోస్తలులకార్యములు 1:11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చునని వారితో చెప్పిరి

అపోస్తలులకార్యములు 1:12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగివెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,

జెకర్యా 4:7 గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.

యెషయా 64:1 గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.

యెషయా 64:2 నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.

మీకా 1:3 ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.

మీకా 1:4 ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,

నహూము 1:5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

నహూము 1:6 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.

హబక్కూకు 3:6 ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు.

మార్కు 11:23 ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

జెకర్యా 14:10 యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టున నున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును,

యోవేలు 3:12 నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

యోవేలు 3:13 పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగి రండి.

యోవేలు 3:14 తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.

యెహెజ్కేలు 47:1 అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను,

యెహెజ్కేలు 47:2 పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొనివచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.

యెహెజ్కేలు 47:3 ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.

యెహెజ్కేలు 47:4 ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను.

యెహెజ్కేలు 47:5 ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.

యెహెజ్కేలు 47:6 అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.

యెహెజ్కేలు 47:7 నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.

యెహెజ్కేలు 47:8 అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.

యెహెజ్కేలు 47:9 వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

యెహెజ్కేలు 47:10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లాయీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.

యెహెజ్కేలు 47:11 అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబి స్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.

యెహెజ్కేలు 47:12 నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.

2సమూయేలు 15:30 అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.

1రాజులు 11:7 సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

యోబు 9:5 వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

కీర్తనలు 18:7 అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

యెహెజ్కేలు 38:20 సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును

హోషేయ 2:18 ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.

యోవేలు 3:2 అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

జెకర్యా 12:3 ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగాచేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

జెకర్యా 14:21 యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్టితములగును; బలిపశువులను వధించువారందరును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.

మత్తయి 21:1 తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి

మత్తయి 24:7 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.

మార్కు 11:1 వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవలకొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి

లూకా 19:29 ఆయన ఒలీవలకొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యులనిద్దరిని పిలిచి

లూకా 21:37 ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.

లూకా 24:44 అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను